పిచ్చి కుక్క దాడి
మండలంలోని నిజాలాపూర్లో ఓ పిచ్చికుక్క నలుగురిపై దాడి చేయగా పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా దవాఖానకు తరలించిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. వివరాలల్లోకి వెళ్తే.. గ్రామంలోని పాఠశాల వద్ద ఉన్న మూడేండ్ల అభినంద్,
- నలుగురి పరిస్థితి విషమం
మూసాపేట, ఏప్రిల్ 18 : మండలంలోని నిజాలాపూర్లో ఓ పిచ్చికుక్క నలుగురిపై దాడి చేయగా పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా దవాఖానకు తరలించిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. వివరాలల్లోకి వెళ్తే.. గ్రామంలోని పాఠశాల వద్ద ఉన్న మూడేండ్ల అభినంద్, భానుప్రకాశ్(9) మానస అనే బాలికపై పిచ్చి కుక్క ఎగబడి విచక్షణా రహితంగా కరుస్తున్న సమయంలో అటువైపు వచ్చిన పల్లెమోని నాగన్న ఆ పిచ్చి కుక్కను బెదిరించి పిల్లలను కాపాడేందుకు వెళ్లాడు. దీంతో పిల్లలను వదిలి కుక్క దూరంగా వెళ్లింది. తిరిగివస్తున్న నాగన్నపై వెనుకవైపు నుంచి దాడి చేసి భుజం, చేతులపై కరిచింది. చెయ్యిపట్టుకొని వదలక పోవడంతో స్థానికులు కుక్క నోట్లో కట్టెపెట్టి చెయ్యిని బయటకు తీశారు. మళ్లీ ఇతరులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో ఆ కుక్కను కొట్టి చంపారు. గాయాలైన ముగ్గురు చిన్నారులను జానంపేట దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ షబానాబేగం జిల్లా దవాఖానకు రెఫర్ చేశారు. అయితే పిల్లలను కాపాడిన నాగన్న దవాఖానకు ఆలస్యంగా వచ్చాడు. దీంతో అతడి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యురాలు వెంటనే 108లో జిల్లా దవాఖానకు తరలించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

