న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: విదేశీ మారకం నిల్వలు క్షీణించాయి. ఈ నెల 12తో ముగిసిన గత వారంలో 5.4 బిలియన్ డాలర్లు పతనమయ్యాయి. అంతకుముందు వారం వరకు వరుసగా 7 వారాలపాటు పెరుగుతూపోయిన ఫారెక్స్ రిజర్వులు.. మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైమ్ హైని తాకిన విషయం తెలిసిందే.
తొలిసారి ఈ నెల 5న 648.562 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఆర్బీఐ తెలిపింది. తాజాగా 5.401 బిలియన్ డాలర్లు పడిపోయి 643.162 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.