Atishi | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 22 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలైన మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్, సౌరభ్ భరద్వాజ్ ఓటమి పాలయ్యారు. కీలక నేతల్లో సీఎం ఆతిశీ (Atishi) ఒక్కరే గెలుపొందారు. కల్కాజీ స్థానం నుంచి ఆమె సమీప ప్రత్యర్థిపై స్వల్ప తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే అని.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో నేను గెలిచాను. కానీ సెలబ్రేట్ చేసుకునే సమయం కాదు. నాపై విశ్వాసం ఉంచి గెలిపించిన కల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది’ అని అన్నారు.
Also Read..
Arvind Kejriwal | ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. బీజేపీకి అభినందనలు : అర్వింద్ కేజ్రీవాల్
PM Modi | ఢిల్లీ అభివృద్ధికి మా గ్యారంటీ.. ఫలితాలపై మోదీ ట్వీట్
Delhi LG | ఎలాంటి ఫైల్స్ బయటకు వెళ్లకూడదు.. సచివాలయ ఉద్యోగులకు ఢిల్లీ ఎల్జీ కీలక ఆదేశాలు