International Yoga Day : పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా వేడుకగా జరుగుతోంది. పలు దేశాల ప్రముఖులు యోగాసనాలు వేస్తూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. భారత్‌లో పెద్ద సంబురంలా యోగా డే సాగుతున్న వేళ.. నార్వే దౌత్యాధికారి సైతం ఆసనాలు వేస్తున్న ఫొటోలను ఆన్లైన్లో పంచుకున్నారు. ఇండియాలో ఆ దేశ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మే ఎలిన్ స్టెనెర్ (May Elin Stener) ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా రెండు కఠినమైన ఆసనాలు వేసింది.
నిరుడు మే ఎలిన్ భారత్‌లో నార్వే దౌత్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి మనదేశ సంస్కృతి, సంప్రదాయాల మీద ఇష్టం పెంచుకున్న ఆమె.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పునస్కరించుకొని ఆసనాలు వేశారు. వీటిలో ఒకటి శీర్షాసనం కాగా.. శీర్షాసనంలో ఉంటూనే ఆమె పద్మాసనం కూడా వేయడం విశేషం. ‘శీర్షాసనం వేసిన తీరు.. అది ఎలా ముగిసిందో చూడండి’ అంటూ తన ఫొటోలను పంచుకున్నారామె.
How it started vs how it’s going🧘♀️
When I moved to India last year, I started practicing #Yoga more actively!
As we mark #InternationalYogaDay2025, proud to show my attempt at headstand lotus pose!
I find #Yoga beneficial for my mental & physical health & hope you do too! 🙏 pic.twitter.com/uqbYiXXRKe
— Ambassador May-Elin Stener (@NorwayAmbIndia) June 21, 2025
‘అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ శీర్షాసనం వేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. గతేడాది ఇండియాకు వచ్చాను. ఇక్కడి సంప్రదాయంలో ఒకటైన యోగాను ఎంతో ఇష్టంగా నేర్చుకోవడం ఆరంభించాను. నేను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడింది. మీకు కూడా ఇలాంటి లాభాలు పొందుతారని ఆశిస్తున్నా’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు మే ఎలెన్.
యోగాదినోవ్సంలో జపాన్ ప్రధాని భార్య, మోడీ
జమ్ముకశ్మీర్ నుంచి టోక్యో, న్యూయార్క్ సిటీ వరకూ ఎక్కడ చూసినా యోగముద్రలో ఉన్న జనంతో కోలాహల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్టణంలో యోగాంధ్ర కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొనగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెహ్రాడూన్‌లో యోగా డేలో ఆసనాలు వేశారు. జపాన్ ప్రధాని భార్య యొషికొ ఇషిబా టోక్యోలో వేలాది మందితో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో బాలీవుడ్ వెటరన్ అనుపమ్ ఖేర్ ఉత్సాహంగా యోగాసనాలు వేస్తూ కనిపించారు.