Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పంజా చిత్రం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అందులో కథానాయికగా నటించింది సారా జేన్ డయాస్. అప్పటికి టాప్ మోడల్ గా సుపరిచితురాలైన ఈ బ్యూటీ నటనా కెరీర్ పరంగా ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ దురదృష్టవశాత్తూ పంజా చిత్రం డిజాస్టరవ్వడంతో సారా పెద్దగా సినిమా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. కోలీవుడ్ దర్శకుడు విష్ణు వర్ధన్ తెరకెక్కించిన పంజా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించగా, అందులో ట్రెండీ లుక్ లో కనిపించింది అంజలి లవానియా. ట్రెడిషినల్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది సారా జేన్ డయస్.
చిత్రంలో సారా క్యూట్ లుక్స్, యాక్టింగ్ ఆడియెన్స్ ను మెప్పించాయి. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ మూవీ తర్వాత సారాకు తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. దాంతో చేసేదేమి లేక తమిళ్, హిందీ సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది. ఆ మధ్య తన డేటింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెనైంది. నేను ఒక వ్యక్తితో చాలా కాలంగా రిలేషన్లో ఉన్నాను. మేము చాలా కాలం పాటు కలిసి ఉన్నందున కుటుంబాలకు ఈ విషయం తెలుసు. కానీ మా మధ్య చిన్నపాటి గొడవలున్నాయి అంటూ సారా జేన్ చెప్పుకొచ్చింది.. బంధాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నానని కూడా గత ఇంటర్వ్యూలో అన్నారు.
అయితే పంజా సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన సారా ఇప్పుడు చాలా బక్కగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు తనకి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్లో దిగిన పిక్ షేర్ చేయగా, ఇది చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఏమైంది సారా ఇంత స్లిమ్ అయ్యావు. ఏదైన హెల్త్ ఇష్యూనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Saa