Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మధ్యంత బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు (No relief). ఈ కేసులో మధ్యంతర బెయిల్ (interim bail)ను మరోసారి పొడిగించాలంటూ తాను పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue court) తిరస్కరించింది.
అనారోగ్య పరిస్థితుల కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం తనకు మరో 7 రోజులు మధ్యంతర బెయిల్ కోరుతూ కేజ్రీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్ కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. వైద్య పరీక్షలను తీహార్ జైల్లోనే నిర్వహించాల్సిందిగా అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేజ్రీ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులకు పొడిగించింది. జూన్ 19 వరకూ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, తీవ్రమైన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
అయితే, కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని బుధవారం స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్ ఇదివరకే అవకాశం ఇచ్చినందున ఈ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని కోర్టు రిజిస్ట్రీ తెలిపింది. దీంతో ఆయన జూన్ 2న మధ్యాహ్నం లొంగిపోయారు.
Also Read..
PM Modi | గెలుపు, ఓటములు రాజకీయాల్లో భాగం.. నంబర్స్ గేమ్ కొనసాగుతుంది : మోదీ
Loksabha Elections 2024 | ఇండియా కూటమి VS ఎన్డీయే : పవర్ వార్‌పై డీ. రాజా కీలక వ్యాఖ్యలు
Trekkers: ఘర్వాల్ పర్వతాల్లో చిక్కుకున్న 19 మంది ట్రెక్కర్లు, నలుగురు మృతి