Trekkers: ఘర్వాల్ పర్వతాల్లో చిక్కుకున్న 19 మంది ట్రెక్కర్లు, నలుగురు మృతి
Trekkers: ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లో బెంగుళూరుకు చెందిన నలుగురు ట్రెక్కర్లు మృతి చెందారు. మరో 19 మంది ఆ కొండల్లోనే చిక్కుకున్నారు. ఘర్వాల్ పర్వత శ్రేణుల్లో ఉన్న సహస్ర తాల్ మయాలీ మార్గంలో పర్వతారోహకులు ఇబ్బందులు పడుతున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లో బెంగుళూరుకు చెందిన నలుగురు ట్రెక్కర్లు(Trekkers) మృతి చెందారు. మరో 19 మంది ఆ కొండల్లోనే చిక్కుకున్నారు. ఘర్వాల్ పర్వత శ్రేణుల్లో ఉన్న సహస్ర తాల్ మయాలీ మార్గంలో పర్వతారోహకులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ట్రెక్కర్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసేందుకు కర్నాటక సర్కారు ఉత్తరాఖండ్‌కు ఆఫీసర్‌ను పంపింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే ఆరుగుర్ని రక్షించారు. మంచు, వర్షం ఎక్కువగా కురుస్తున్న కారణంగా.. విజిబులిటీ క్షీణించిందని, అందుకే హెలికాప్టర్లతో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ నిదానంగా సాగుతున్నట్లు తెలిపారు. ప్రైవేటు మౌంటెనేరింగ్ ఏజెన్సీ ద్వారా ట్రెక్కర్లు ఉత్తరాఖండ్ వెళ్లినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

