Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సొంతంగా లభించకపోవడంతో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై పాలక, విపక్ష కూటముల మధ్య రసవత్తర పోరు సాగుతోంది.
ఎన్డీయే, ఇండియా కూటమి ఎవరికి వారే ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతుండటం కాక రేపుతోంది. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన జేడీయూ, టీడీపీలతో చెలిమికి ఇండియా కూటమి కసరత్తు సాగిస్తోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఢిల్లీలో పవర్ వార్‌పై సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా బుధవారం ఢిల్లీలో విలేకరులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు హస్తిన వేదికవుతుందో తాము వేచిచూడాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఇండియా బ్లాక్, ఎన్డీయే కీలక భేటీలు ఉన్నాయని రాజా అన్నారు. ఇండియా బ్లాక్, ఎన్డీయే మధ్య అధికార పోరాటం ఆసక్తికరంగా మారిందని ఎవరికి సంఖ్యాబలం చేకూరుతుంది..రాష్ట్రపతి నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి ఆహ్వానం లభిస్తుందనేది మనం వేచిచూడాలని రాజా పేర్కొన్నారు. రాజకీయ పార్టీలుగా ఈ ప్రశ్నలు తమ ముందున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
Read More :
Bomb Threat | ఢిల్లీ – టొరంటో విమానానికి బాంబు బెదిరింపులు