Air India | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. తమ విమానాల ఇంధన సరఫరా వ్యవస్థ సవ్యంగానే ఉందని వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యగా బోయింగ్ (Boeing) 787, 737 విమానాలన్నింటిలోనూ ఇంధన సరఫరా వ్యవస్థల లాకింగ్ మెకానిజంను (fuel control switch) తనిఖీ చేసినట్లు తెలిపింది. ఈ తనిఖీలు విజయవంతంగా పూర్తైనట్లు మంగళవారం ప్రకటించింది. ఈ తనిఖీల్లో ఎలాంటి సమస్యలూ బయటపడలేదని (No issues found) స్పష్టం చేసింది.
‘తనిఖీల సమయంలో లాకింగ్ మెకానిజంలో ఎలాంటి సమస్యలూ కనుగొనలేదు. డీజీసీఏ ఆదేశానికి ముందే జులై 12న ఎయిర్ ఇండియా విమానాల్లో స్వచ్ఛంద తనిఖీలను చేపట్టాం. ఇదే విషయాన్ని నియంత్రణ సంస్థకు కూడా తెలియజేశాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ఎయిర్ ఇండియా కట్టుబడి ఉంది’ అని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. జూన్ 12న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. లేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్పై కూలిపోయింది. ఈ ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంధన స్విచ్ఛ్లు ఆగిపోయినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్ఛులపై తనిఖీ చేపట్టాలని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించిన విషయం తెలిసిందే.
Also Read..
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 19 రోజుల్లో 3.21 లక్షల మంది దర్శనం
Jagdeep Dhankhar | ధన్ఖడ్ రాజీనామా.. ప్రధాని మోదీ స్పందన ఇదే..