Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు (huge rush) పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు. జులై 2న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జులై 21వ తేదీ వరకూ అంటే 19 రోజుల్లో 3.21 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు జమ్ము ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే యాత్ర మార్గంలో నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించింది. దీంతో యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్ మార్గం నుంచి కాలినడకన, లేదా పోనీల సాయంతో మంచు లింగం వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఏడాది జులై 2న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజులపాటు సాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read..
Bomb Threat | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
Jagdeep Dhankhar | ధన్‌ఖడ్ రాజీనామా.. ప్రధాని మోదీ స్పందన ఇదే..