Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి (Ahmedabad Airport) ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సోదాలు చేపట్టారు.
విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ (Ahmedabad Crime Branch)కు మంగళవారం ఉదయం బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో సోదాలు చేపట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకూ జరిపిన సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరద్ సింఘాల్ తెలిపారు. ఎయిర్పోర్ట్ వద్ద ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
Ahmedabad, Gujarat | Crime Branch has received a bomb threat email regarding Ahmedabad airport. Search is underway and nothing suspicious has been found so far. Police and fire brigade are at the spot: Sharad Singhal, Joint Commissioner of Police, Ahmedabad Crime Branch
— ANI (@ANI) July 22, 2025
Also Read..
Jagdeep Dhankhar | ధన్‌ఖడ్ రాజీనామా.. ప్రధాని మోదీ స్పందన ఇదే..
Apache Helicopters | అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న అపాచీ అటాక్ హెలికాప్టర్లు
F-35 Fighter Jet | ఎట్టకేలకు కేరళను వీడిన బ్రిటన్ ఫైటర్ జెట్