Apache Helicopters | అమెరికా నుంచి అత్యాధునిక అపాచీ ఏహెచ్-64ఈ అటాక్ హెలికాప్టర్లు (Apache attack Helicopters) భారత్‌కు చేరుకున్నాయి. భారత వాయుసేనకు (Indian Army) చెందిన హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇవాళ ల్యాండ్ అయ్యాయి. ఈ హెలికాప్టర్ల కోసం భారత్ ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. అనివార్య కారణాలవల్ల వాటి డెలివరీ ఆలస్యమైంది. ఆ హెలికాప్టర్లను శత్రుసేనలపై దాడులకు, గూఢచర్యానికి రెండు విధాలుగా వినియోగిస్తారు. ఈ హెలికాప్టర్లను పాకిస్థాన్ సరిహద్దుల్లో మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో తొలి అపాచీ స్క్వాడ్రన్‌ను నెలకొల్పిన 15 నెలల తర్వాత ఈ హెలికాప్టర్లు భారత్‌కు చేరుకున్నాయి.
కాగా, ఇప్పటికే 2015లో అమెరికా ప్రభుత్వంతో, బోయింగ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు భారత వాయుసేన అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. 2020 జూలైలో అమెరికా వాటిని భారత్‌కు డెలివరీ చేసింది. అదే ఏడాది చివరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చినప్పుడు మరో 6 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఆ 6 హెలికాప్టర్లకుగాను ఒప్పందంలో భాగంగా తొలి విడత మూడు హెలికాప్టర్లు 2024 మే, జూన్ నెలల్లో భారత్‌కు రావాల్సి ఉంది. అయితే, సప్లయ్ చైన్‌లో అంతరాయాలు, అంతర్జాతీయంగా జియోపొలిటికల్ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఈ అపాచీ హెలికాప్టర్లు భారత్‌కు చేరుకోవడంలో ఆలస్యం జరిగింది.
The first batch of Apache attack Helicopters for the Indian Army has reached India. The choppers will be deployed in Jodhpur by the Indian Army: Indian Army officials
(Pics source: Indian Army) pic.twitter.com/u1u1Qwi56m
— ANI (@ANI) July 22, 2025
Also Read..
Cyberattack | సైబర్ దాడితో మూతపడిన 158 ఏళ్ల నాటి కంపెనీ.. రోడ్డునపడ్డ 700 మంది ఉద్యోగులు
F-35 Fighter Jet | ఎట్టకేలకు కేరళను వీడిన బ్రిటన్ ఫైటర్ జెట్
Monsoon Parliament Session | రెండోరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు.. వెంటనే వాయిదా పడిన ఉభయసభలు