ప్రైవేట్ ఉద్యోగి డిజిటల్ అరెస్ట్
మీరు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.. మీపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్కాడ్ కేసు నమోదు చేసిందని, దీంతో సుప్రీంకోర్టు ఫ్రీజ్ ఆర్డర్ జారీ చేసిందంటూ సైబర్‌నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ. 30 లక్షలు స్వాహా చేశారు.
- రూ. 30 లక్షలు స్వాహా చేసిన సైబర్‌చీటర్స్
సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మీరు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.. మీపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్కాడ్ కేసు నమోదు చేసిందని, దీంతో సుప్రీంకోర్టు ఫ్రీజ్ ఆర్డర్ జారీ చేసిందంటూ సైబర్‌నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ. 30 లక్షలు స్వాహా చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ సఫిల్‌గూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగం చేసే వ్యక్తికి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి(సైబర్‌నేరగాడు) ఫోన్‌చేసి..మీరు కెనెరా బ్యాంకు డెబిట్ కార్డు తీసుకున్నారని, దానిలో రూ.36 లక్షలు ఉన్నాయని, అంత డబ్బు ఎక్కడిదని అడిగారు.
ఆ కార్డుతో తనకు సంబంధం లేదని, కెనరా బ్యాంకులో తనకు అకౌంట్ లేదంటూ బాధితుడు చెప్పాడు. మీరు వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు రావాలని , మీ ఆధార్‌కార్డు అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యిందంటూ బెదిరించారు. మీ బ్యాంకు ఖాతాలు చెక్ చేయాలని, వెంటనే మీరు రూ. 30 లక్షలు డిపాజిట్ చేయా లని, మీకు నాన్ ఇన్వాల్మెంట్ సర్టిఫికేట్ జారీ చేస్తామని సూచించారు.
మీరు చెప్పినట్లు ఈ కేసుతో ఎలాంటి సంబ ంధం లేదంటే మీ డబ్బులు మీకు తిరిగి వాపస్ వచ్చేస్తా యంటూ సూచించారు. సైబర్‌నేరగాళ్ల ఒత్తిడికి బయపడిన బాధితుడు అతని వద్ద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసుకొని, రూ. 30 లక్షలు సైబర్‌నేరగాళ్లు సూచించిన ఖాతాలోకి బదిలీ చేశాడు. తేరుకున్న బాధితుడు ఇదంతా మోసమని గుర్తించి మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

