F-35 Fighter Jet | సాంకేతిక సమస్యల కారణంగా కేరళ (Kerala)లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్‌పోర్ట్‌లో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్-35 బి స్టెల్త్ యుద్ధ విమానం ఎట్టకేలకు టేకాఫ్ అయ్యింది. ఇవాళ ఉదయం కేరళను వీడింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో (Fighter jets) ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) 40 రోజులుగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇండో-యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ ఎఫ్-35బి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఆ విమానాన్ని జూన్ 14న అర్ధరాత్రి తర్వాత తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. తొలుత ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత కారణంగా విమానాన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఫైటర్ జెట్‌లో ఇంజినీరింగ్ సమస్య తలెత్తినట్లు ఆ తర్వాత యూకే అధికారులు వెల్లడించారు.
ఈ ఫైటర్ జెట్‌కు ఇక్కడ మరమ్మతులు చేయడానికి వీలు కాకపోవడంతో బ్రిటన్ నుంచి నిపుణులను రప్పించారు. 24 మంది స్పెషల్ ఎక్స్పర్ట్స్ బృందం వచ్చి విమానానికి మరమ్మతులు చేపట్టింది. విమానంలోని లోపాలను సరిచేసింది. దీంతో విమానం ఎట్టకేలకు గాల్లోకి ఎగిరింది. దాదాపు ఐదు వారాల తర్వాత ఇవాళ ఉదయం కేరళ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యి బ్రిటన్‌కు బయల్దేరి వెళ్లింది.
#WATCH | Kerala: The British Navy’s F-35 fighter aircraft, which made an emergency landing at Thiruvananthapuram International Airport on June 14, takes off from the airport. pic.twitter.com/RT9vlsL73W
— ANI (@ANI) July 22, 2025
Also Read..
Jairam Ramesh | ధన్‌ఖడ్ రాజీనామా వెనుక లోతైన కారణం ఉండొచ్చు : జైరాం రమేష్
Monsoon Parliament Session | రెండోరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు.. వెంటనే వాయిదా పడిన ఉభయసభలు
Next Vice President | ధన్‌ఖడ్ రాజీనామా.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరంటే?