Cyberattack | సైబర్ దాడి (Cyberattack) కారణంగా 158 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (UK transport company) మూతపడింది. దీంతో అందులో పనిచేసే దాదాపు 700 మంది ఉద్యోగులు (employees) వీధినపడ్డారు.
బ్రిటన్కు చెందిన ట్రాన్స్పోర్టు కంపెనీ కేఎన్పీ లాజిస్టిక్స్ది (KNP Logistics) సుదీర్ఘ చరిత్ర. దాదాపు 158 ఏళ్లుగా రవాణా రంగంలో వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థ సుమారు 500 లారీలను నిర్వహించేది. అయితే, వీక్పాస్ వర్డ్ కారణంగా సైబర్ నేరగాళ్లు కంపెనీ సిస్టమ్లోకి చొరబడి కీలకమైన సమాచారాన్ని తమ నియంత్రణలో తీసుకున్నారు. డాటా మొత్తాన్ని ఉద్యోగులు వినియోగించుకోలేని విధంగా ఎన్క్రిప్ట్ చేశారు. ఈ డాటాను తిరిగి పొందాలంటే కొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ సంస్థ యాజమాన్యం వద్ద అంత డబ్బు లేకపోవడంతో చేతులెత్తేసింది. చివరకు సంస్థ మూతపడింది. అందులోని 700 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. అయితే, సైబర్ నేరగాళ్లు ఎంత మొత్తం డిమాండ్ చేశారన్నదానిపై మాత్ర స్పష్టతరాలేదు.
Also Read..
F-35 Fighter Jet | ఎట్టకేలకు కేరళను వీడిన బ్రిటన్ ఫైటర్ జెట్
Jairam Ramesh | ధన్ఖడ్ రాజీనామా వెనుక లోతైన కారణం ఉండొచ్చు : జైరాం రమేష్