Jagdeep Dhankhar | దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి (Vice-President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఎగువసభను సజావుగా నడిపించిన ఆయన రాత్రికి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆయన రాజీనామాపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది.
ఇదే సమయంలో పలు ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య కారణాలతో పదవి నుంచి దిగిపోతున్నట్లు ధన్‌ఖడ్ చెప్పినప్పటికీ.. ఆయన రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదో లోతైన కారణం ఉండొచ్చని భావిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో విభేదాలు తలెత్తాయని అందుకే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వేళ కీలక విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ధన్‌ఖడ్ ఒక్కసారిగా కుప్పకూలినట్లు (collapsed during an event ) సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
జులై 17న ధన్‌ఖడ్ తన భార్య, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో కలిసి ఓ గార్డెన్‌ను సందర్శించారు. ఆ సమయంలో ధన్‌ఖడ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారని.. సిబ్బంది సాయంతో అక్కడి నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఇలా అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. కాగా, ధన్‌ఖడ్‌కు ఇటీవలే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే.
Also Read..
Jairam Ramesh | ధన్‌ఖడ్ రాజీనామా వెనుక లోతైన కారణం ఉండొచ్చు : జైరాం రమేష్
Jagdeep Dhankhar | ధన్‌ఖడ్ రాజీనామా.. ప్రధాని మోదీ స్పందన ఇదే..