సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 17:31:31

భూమిపూజ‌కు ద‌ళితుల‌ను పిల‌క‌పోవ‌డంపై మాయావ‌తి అసంతృప్తి

భూమిపూజ‌కు ద‌ళితుల‌ను పిల‌క‌పోవ‌డంపై మాయావ‌తి అసంతృప్తి

న్యూఢిల్లీ : అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన భూమిపూజ నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని 200 మంది అర్చ‌కుల‌కు అందింది. వీరంద‌రిలో ఏ ఒక్క ద‌ళిత పూజారి కూడా లేడు. దీనిపై బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ మాయావ‌తి స్పందించారు.

ద‌ళిత సాధువుల‌ను రామ‌మందిరం భూమిపూజ‌కు పిల‌క‌పోవ‌డం కుల వివ‌క్ష చూప‌డ‌మే అని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కుల ర‌హిత స‌మాజ నిర్మాణం కోసం కృషి చేస్తామ‌ని చెప్పుకునే వారు.. స్వామి క‌న్హ‌య్య ప్ర‌భునంద‌న్ గిరి లాంటి వారిని భూమిపూజ‌కు ఆహ్వానిస్తే బాగుండేదన్నారు. స‌మాజంలో ద‌ళితులు నిర్ల‌క్ష్యానికి గుర‌వుతూనే ఉన్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ అంబేడ్క‌ర్ న‌డిచిన మార్గాన్ని ఎంచుకోవాల‌ని బీఎస్పీ సూచన చేస్తుందన్నారు మాయావ‌తి.  జునాలో స్వామి కన్హయ్య ప్రభునందన్ గిరి ఏకైక దళిత మహామండలేశ్వర్‌‌గా ఉన్నారు. అగ్ర కులాలకు చెందిన అర్చకులు, పూజారులను మాత్రమే భూమి పూజకు పిలిచారని కన్హయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌ధాని చేతుల‌మీదుగానే శంకుస్థాప‌న జ‌రుగ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు ఆయోధ్య‌లో భారీ బందోబ‌స్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ఇప్ప‌టికే ఏర్పాట్లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఈ మేర‌కు మ‌ని రాందాస్ చావ్నీలో ల‌డ్డూల త‌యారీ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజరైన వారంద‌రికీ పంచిపెట్ట‌డం కోసం మొత్తం 1.11 ల‌క్ష‌ల ల‌డ్డూలు త‌యారు చేస్తున్నారు. 


logo