ఖర్జూరం పండు.. పోషకాలు మెండు
ఎడారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇవి ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తాయి

ఎడారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇవి ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తాయి. ఖర్జూరంలో విటమిన్ ఏ, బీ, సీ, డీ లతో పాటు కాల్షియమ్, పోరస్, ఫాస్ఫరస్ ఫైబర్ కూడా ఉన్నాయి. అందుకే ఖర్జూరంను ప్రోటీన్స్ పవర్ హౌస్ అని అంటారు.
ఇందులో గ్లూకోస్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. చూడటానికి ఈతపండులా ఉండే ఖర్జూరం అందరికీ ప్రీతిపాత్రమే అని చెప్పాలి. రంజాన్ పండుగ రాగానే ఉపవాసాల్లో ఖర్జూరాలు కనిపిస్తాయి.
ఖర్జూరంలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంపొందించడమే కాకుండా.. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. నీరసంగా.. శక్తిని కోల్పోయినట్లు భావించేవాళ్లు ఖర్జూరం తింటే చాలు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ప్రతి 100 గ్రాములు ఖర్జూరాల్లో 0.90 మి. గ్రా ఐరన్ ఉంటుంది.
ఒక్క ఖర్జూరం తింటే వాటి నుంచి మన శరీరానికి 0.2 గ్రాముల ప్రోటీన్, 5.3 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల చక్కెరలు, 0.6 గ్రాముల ఫైబర్, 0.14 గ్రాముల సోడియం, 20 క్యాలరీల శక్తి లభిస్తుండగా.. ఎలాంటి కొవ్వులు అందవు. ఖర్జూరాలు తింటే అందులో ఉన్న పీచుపదార్థాలు శరీరంలో ఉన్న చెడుకొలెస్ట్రాల్‌కు అడ్డుపడి శరీరంలో ఇంకకుండా చూస్తాయి. దాంతోపాటు మలవిసర్జనం తేలికవుతుంది.
టాన్సిన్ అని పిలిచే ప్లేవనాయిడ్ పాలిఫీనాలిక్ యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లు, మంట, వాపు వంటివి కలగడాన్ని, రక్తసవ్రాలను నివారిస్తాయి. ఇందులో ఉన్న జీ-గ్జాంథిన్ అనే పోషకం మన కంటి రెటీనాలోకి శోషితమై కంటిని సంరక్షిస్తుంటుంది.
శృంగార సామర్ధ్యం పెరిగేందుకు..

గుండె సమస్యలకు ఖర్జూరాలు బాగా పనిచేస్తాయి. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు, గుండె నీరసంగా ఉన్నవారికి బాగా సహకరిస్తుంది.
తక్షణ శక్తి కావాలంటే ఖర్జూరం తినాల్సిందే. దీనిలో ఉండే గ్లూకోజ్ తక్షణ శక్తిని ఇచ్చి మనల్ని చురుకుగా ఉండేలా చేస్తుంది
శరీరం బరువు పెరుగడానికి ఖర్జూరాలు బాగా దోహదపడతాయి.
ఖర్జూరం కంటి సమస్యలను తగ్గిస్తుంది.
మూత్రసంబంధ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది.
పాలల్లో నానబెట్టి తినడం వల్ల శృంగార సామర్ధ్యం బాగా పెరుగుతుంది.
ఒకవైపు కొలెస్ట్రాల్ తగ్గిస్తూ.. మరోవైపు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.
ఎముకలను బలంగా, పటుత్వంగా ఉంచడంలో సహాయపడతాయి.
చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
తలవెంట్రుకలు పెరిగేందుకు, జట్టు రాలడాన్ని నివారిస్తుంది.
డయాబెటీస్, గుండె, రక్త సమస్యలు, ఇతరాత్ర వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా వైద్యుల సూచన తర్వాతనే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్‌బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్‌లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్‌లో లాక్‌డౌన్‌కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

