ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. విమాన ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదని అన్నారు. అజిత్ పవార్ ఈ ప్రమాదంలో మరణించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణంతో మహారాష్ట్రకు తీరని నష్టం జరిగిందని శరద్ పవార్ తెలిపారు. ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రోజు మనల్ని విడిచి వెళ్ళిపోయారని చెప్పారు. ‘మహారాష్ట్ర ఈ రోజు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఈ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేం’ అని అన్నారు.
కాగా, అన్నీ మన చేతుల్లో ఉండవని అజిత్ పవార్ బాబాయ్ అయిన 85 ఏళ్ల శరద్ పవార్ తెలిపారు. తాను నిస్సహాయంగా ఉన్నట్లు చెప్పారు. ‘ఏడవడం సిగ్గుగా అనిపించవచ్చు. కొన్ని సంఘటనల వెనుక రాజకీయాలు ఉండవు. ఈ విషయంలో నా వైఖరిని నేను స్పష్టంగా చెప్పా. దీనిలో ఎలాంటి కుట్ర లేదు. ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే. మహారాష్ట్ర, మనమందరం ఈ బాధను జీవితాంతం భరించాల్సి ఉంటుంది. దయచేసి దీనిలోకి రాజకీయాలను తీసుకురావద్దు, నేను చెప్పదలుచుకున్నది ఇంతే’ అని ఆయన అన్నారు.
NCP SP chief Sharad Pawar’s emotional reaction, speaks against any politics over the death of Ajit Pawar…. pic.twitter.com/I5YYT98A7z
— Vasudha Venugopal (@Vasudha156) January 28, 2026
Also Read:
Ramdas Athawale | అజిత్ పవార్ మరణంపై దర్యాప్తు చేయాలి: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
Eknath Shinde on Ajit Pawar | కపటం లేని, భయంలేని నేత అజిత్ పవార్: ఏక్నాథ్ షిండే
Air India Flight | తప్పిన ముప్పు.. రన్ వే టచ్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ రద్దు
Watch: వృద్ధుడిని కొమ్ములతో ఎత్తి పడేసిన ఎద్దు.. తర్వాత ఏం జరిగిందంటే?