Manish Sisodia | మద్యం పాలసీ కేసు (Excise policy Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia )కు ఊరట లభించలేదు. ఈడీ (ED), సీబీఐ (CBI) విచారణ చేపడుతున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi excise policy)కి సంబంధించిన కేసుల్లో ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది.
ఈ కేసుల్లో సిసోడియా బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భార్య అనారోగ్యం కారణంగా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సిసోడియా తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. సిసోడియా సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసుకునేందుకు వెళ్లడం కోసం మానవతా దృక్పథంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.
దీంతో న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సిసోడియా భార్య వైద్య రికార్డులను పరిశీలించింది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అందువల్ల, ఈ కేసుల్లో సాధారణ బెయిల్ పిటిషన్లతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మధ్యంతర బెయిల్ పిటిషన్లను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేసింది.
Also Read..
Gyanvapi Mosque | గట్టి భద్రత మధ్య జ్ఞానవాపిలో ప్రారంభమైన సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ సభ్యులు
Kedarnath Yatra | కేదార్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. పలువురు గల్లంతు
IndiGo | పాట్నా-ఢిల్లీ విమానంలో ఇంజిన్ ఫెయిల్.. టేకాఫ్ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్