IndiGo | పాట్నా-ఢిల్లీ విమానంలో ఇంజిన్ ఫెయిల్.. టేకాఫ్ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్
IndiGo | పాట్నా (Patna) నుంచి ఢిల్లీ (Delhi) బయల్దేరిన ఇండిగో విమానానికి (IndiGo Flight) పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన మూడు నిమిషాల్లోనే సాంకేతిక సమస్య కారణంగా అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) అయ్యింది.
IndiGo | పాట్నా (Patna) నుంచి ఢిల్లీ (Delhi) బయల్దేరిన ఇండిగో విమానానికి (IndiGo Flight) పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన మూడు నిమిషాల్లోనే సాంకేతిక సమస్య కారణంగా అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) అయ్యింది. ఇందుకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్ (Bihar) రాజధాని పాట్నా (Patna)లోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Jay Prakash Narayan International Airport) నుంచి శుక్రవారం ఉదయం ఇండిగో 6ఈ 2433 విమానం ఢిల్లీకి బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఒక ఇంజిన్ పనిచేయడం లేదని పైలట్ గుర్తించి ఈ సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఉదయం 9.11 గంటలకు విమానాన్ని పాట్నా విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
‘పాట్నా విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరి ఇండిగో ఫ్లైట్ 6ఈ 2433 విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఇంజిన్ పనిచేయలేదని గుర్తించాం. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. 9.11 గంటలకు అదే ఎయిర్ పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రస్తుతం విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలు సాధారణంగానే సాగుతున్నాయి’ అని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. మరోవైపు ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
Also Read..
Viral Video | దొంగను చావబాదిన సిక్కు ఎన్నారై.. వీడియో వైరల్
Gyanvapi Mosque | గట్టి భద్రత మధ్య జ్ఞానవాపిలో ప్రారంభమైన సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ సభ్యులు
Rishi Sunak | రిషి సునాక్ ఇంటిపై నల్లటి వస్త్రం కప్పి.. నిరసన వ్యక్తం చేసిన పర్యావరణకారులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

