Nitin Gadkari | కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన కేంద్ర మంత్రి గడ్కరీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Nitin Gadkari | కాంగ్రెస్ నేతలకు (Congress Leaders) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari ) లీగల్ నోటీసులు (Legal Notice) పంపారు.
Nitin Gadkari | కాంగ్రెస్ నేతలకు (Congress Leaders) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari ) లీగల్ నోటీసులు (Legal Notice) పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge ), సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh)లకు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు పంపించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 19 సెకన్ల క్లిప్పింగ్‌ను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది. గ్రామస్థులు, పేదలు, కూలీలు, రైతులు సంతృప్తికరంగా లేరు. గ్రామాల్లో మంచి రోడ్లు లేవు, తాగునీరు, మంచి ఆసుపత్రులు, పాఠశాలలు అందుబాటులో లేవు అంటూ గడ్కరీ వీడియోలో అన్నారు. అయితే, కాంగ్రెస్ షేర్ చేసిన ఆ వీడియో క్లిప్‌పై గడ్కరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో తీసుకుంటున్న చర్యల గురించి తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ ఈ పోస్ట్ పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సందర్భం ఉద్దేశాన్ని బయటపెట్టకుండా అర్థం మారేలా ఆ క్లిప్పింగ్‌లో మార్పులు చేశారని మండిపడ్డారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు, నన్ను కించపరిచేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని అన్నారు. ఈ మేరకు తన లాయర్ ద్వారా ఖర్గే, జైరాం రమేశ్‌కు లీగల్ నోటీసులు పంపినట్లు చెప్పారు. నోటీసులు అందిన 24 గంటల్లో ఆ వీడియో క్లిప్‌ను డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మూడు రోజుల్లో తనకు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read..
Anant Ambani | అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్.. బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల సందడి
Isha Ambani | సోదరుడి ముందస్తు వివాహ వేడుకల్లో మెరిసిన ఈషా అంబానీ.. ఆఫ్ షోల్డర్ గౌనులో
Gautam Gambhir | నడ్డా జీ.. నన్ను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించండి: గౌతమ్ గంభీర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

