Isha Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఈషా అంబానీ (Isha Ambani) మరోసారి తన ఫ్యాషన్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తన సోదరుడు అనంత్ అంబానీ (Anant Ambani) ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో (pre wedding event) అందమైన డ్రెస్‌లో మెరిసిపోయారు.
అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ (Jamnagar)లో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఈషా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మృదువైన గులాబీ రంగు గౌనులో మెరిసిపోయారు. ఈషా ధరించిన ఈ ఆఫ్ షోల్డర్ గౌను లండన్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ మిస్ సోహీ డిజైన్ చేశారు. డ్రెస్‌కు తగ్గట్టు సింపుల్ నెక్లెస్, ఇయర్ రింగ్స్, లైట్ మేకప్‌తో ఈషా ఎంతో అందంగా తయారైంది. ఎంతో స్లైలిష్‌గా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Anant Ambani | అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్.. బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల సందడి
Tripti Dimri | యానిమల్‌లో ఆ సన్నివేశాలు చూసి అమ్మానాన్న ఇబ్బందిపడ్డారు..: త్రిప్తి డిమ్రీ