Tripti Dimri | ‘యానిమల్’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది త్రిప్తి డిమ్రీ. అందులోని ఆమె పాత్రపై పలు విమర్శలు కూడా తలెత్తాయి. ఇటీవల ఆ పాత్ర గురించి త్రిప్తి మీడియాతో ముచ్చటించింది. ‘ఈ రంగంలో పరిథుల్ని పెట్టుకుంటే అనుకున్నది సాధించలేం. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటే చేయాలనుకుంది చేయలేం. అందుకే.. ‘యానిమల్’కి ఓకే చెప్పాను. అందులో నా శృంగార సన్నివేశాలు చూసి అమ్మానాన్న ఇబ్బందిగా ఫీలయ్యారు.
ఆ సన్నివేశం సినిమాకు ఎంత అవసరమో వివరించి చెప్పాల్సొచ్చింది. వాళ్లు అర్థం చేసుకున్నారు. ‘యానిమల్’ వచ్చాక జనం నన్ను గుర్తుపడుతున్నారు. స్టార్‌గా చూస్తున్నారు. దానికి కారణం నేను నటించిన శృంగార సన్నివేశాలు కావు. నా పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ. కథలోని పాత్ర కావడంవల్లే నాకీ గుర్తింపు. థ్యాంక్స్ సందీప్‌రెడ్డి వంగా.’ అంటూ చెప్పుకొచ్చింది త్రిప్తి డ్రిమీ. ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు, రెండు తెలుగు సినిమాలతో బిజీగా ఉందీ అందాలభామ.