Gautam Gambhir | నడ్డా జీ.. నన్ను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించండి: గౌతమ్ గంభీర్
తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అన్నారు. ఇకపై క్రికెట్‌పై దృష్టి సారించాలనుకుంటున్నానని చెప్పారు.
న్యూఢిల్లీ: తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అన్నారు. ఇక క్రికెట్‌పై దృష్టి సారించాలనుకుంటున్నానని చెప్పారు. ఈమేరకు తనను రాజకీయ బాధ్యతలను నుంచి తప్పించాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘క్రికెట్‌పై దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. అందువల్ల నడ్డా గారు నన్ను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించండి. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన మోదీ, అమిత్‌షాకు ధన్యవాదాలు’ అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు.
అయితే ఈ ఏడాది జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో గంభీర్‌కు మరోసారి టికెట్ కేటాయించే అవకాశం లేనట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, 2019, మార్చిలో ఆయన బీజేపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీచేసిసి 6,95,109 ఓట్లతో విజయం సాధించారు.
I have requested Hon’ble Party President @JPNadda ji to relieve me of my political duties so that I can focus on my upcoming cricket commitments. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Hon’ble HM @AmitShah ji for giving me the opportunity to serve the people. Jai Hind!
— Gautam Gambhir (@GautamGambhir) March 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

