Nirmala Sitharaman | వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)కి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభలో గురువారం ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఇక పార్లమెంట్లో ఆమె చేసే ప్రసంగాలే కాదు.. సందర్భానుసారంగా ఆమె ధరించే వస్త్రాలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. ప్రతి ఏటా ఈ ప్రత్యేక సందర్భంలో సమావేశాలకు నిరాడంబరంగా హాజరయ్యే కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ఏడాది కూడా అదే తీరును అనుసరించారు. ఈ సారి కూడా నిర్మలమ్మ చీరఎంపికలో తన మార్క్‌ను చూపించారు (signature sarees on Budget Day).
చేనేత చీరలను ఇష్టపడే నిర్మలమ్మ.. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ బడ్జెట్ సమావేశాలకు ఆమె చేనేత చీరనే ధరిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఆమె ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు. ఈసారి ఆమె టస్సర్ హ్యాండ్లూమ్ బ్లూ, క్రీమ్ కలగలిపిన చేనేత చీరను ఎంచుకున్నారు. ఈ కలర్‌ను ‘రామా బ్లూ’ అని పిలుస్తారు. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్టకు ప్రతీకగా ఆమె ఈ చీరను ధరించారు.
ఇక 2019లో తొలిసారి బడ్జెట్ ప్రసంగానికి నిర్మలమ్మ.. మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్ కేస్ స్థానంలో బహీ ఖాతా (ఎర్నటి వస్త్రంతో చుట్టిన సంచీ)తో పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఇక 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ – బంగారు వర్ణంలో ఉన్న చీరతో సమావేశాలకు హాజరయ్యారు. 2021లో ఎరుపు – గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో మెరిశారు. 2022లో మెరూన్ కలర్ ఒడిశా చేనేత చీరను ధరించారు. రస్ట్ బ్రౌన్, డార్క్ మెరూన్ కలగలిసిన చీరకు ఆఫ్ వైట్ నేత బోర్డర్ మరింత ఆకర్ణణీయత తెచ్చింది. ఆ చీరలో ఆమె నిరాడంబరతకు నిదర్శనంగా నిలిచారు. ఇక గతేడాది టెంపుల్ డిజైన్‌తో నలుపు, బంగారు వర్ణాల అంచుతో ఎరుపు రంగు చీరలో ఆకట్టుకున్నారు.
Also Read..
Union Budget 2024-25 | నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే చిన్నది.. అతి పెద్దది ఏదంటే..?
Union Budget 2024-25 Highlights | మధ్యంతర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
Cervical cancer: గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన కోసం అమ్మాయిలకు టీకాలు: మంత్రి నిర్మల