Asian Games : ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ విద్యా రామరాజ్ (Vithya Ramraj) అదరగొడుతోంది. మిక్స్డ్ రీలేలో వెండి పతకం గెలుపొందిన తను వ్యక్తిగత విభాగంలోనూ పతకంతో మెరిసింది. సోమవారం 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో సత్తా చాటిన విద్య కంచు మోత మోగించింది. ఇదివరకే భారత అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష(PT Usha) జాతీయ రికార్డు సమం చేసిన విద్య.. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసింది. దాంతో.. ఒకే ఎడిషన్‌లో రెండుసార్లు పోడియం మీద మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిందీ పరుగుల చిరుత.
పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ విద్యా రామరాజన్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే మిక్స్డ్ 4×400 మీటర్ల రీలేలో సిల్వర్ మెడల్ సాధించిన తను ఈసారి వ్యక్తిగత విభాగంలోనూ కాంస్యం పట్టేసింది. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో విద్య అద్భుత ప్రదర్శన చేసింది.
జాతీయ రికార్డును బద్ధలు కొడుతూ 54.57 సెకన్లలోనే విద్య లక్ష్యాన్ని చేరుకుంది. ఇదివరకూ 55.42 సెకన్లతో పీటీ ఉష రికార్డు సమం చేసిన విద్య ఈసారి 01.51 సెకన్ల కంటే తక్కువ టైమింగ్‌లోనే హర్డిల్స్‌ను దాటింది. దాంతో.. మరోమారు పోడియం మీద సగర్వంగా కాంస్య పతకాన్ని స్వీకరించింది విద్య. యూఏఈకి చెందిన మరియం కరీం పసిడి, అడెలినా జెమ్స్(కజకిస్థాన్) రజతం గెలుపొందారు.
BRONZE FOR VITHYA RAMRAJ!
Vithya clears all 10 hurdles in 54.75s to win bronze in the Women’s 400m Hurdles at the #AsianGames2026 — a massive PB and NEW NATIONAL RECORD!
She breaks the 55.42s mark set by P.T. Usha in 1984 — a record she herself equalled in 2023.
🥇 Mariam…
— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 28, 2026