oldman | చనిపోయిన వ్యక్తిని అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే అందరికీ షాక్ ఇస్తూ అతడు లేచి కూర్చోవడం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. రీల్ లైఫ్ సీన్లా రియల్ లైఫ్‌లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది.
ఓ వృద్ధుడిని చనిపోయాడనుకుని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో జరిగింది. సిరిసిల్లకు చెందిన శంకరయ్య అనారోగ్యం బారిన పడటంతో కుటుంబసభ్యులు అతన్ని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే శంకరయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు.
దీంతో అతన్ని కుటుంబసభ్యులు అంత్యక్రియల కోసం శంకరయ్యను అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా లేచి కూర్చున్నాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు శంకరయ్యను తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
చనిపోయాడనుకుని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చున్న వృద్ధుడు
సిరిసిల్ల జిల్లాకు చెందిన శంకరయ్య అనారోగ్యంగా ఉండడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు
అప్పటికే శంకరయ్య మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు
అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో… pic.twitter.com/1Bopm6sXxV
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2026
UPI Transactions: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్.. తాత్కాలిక స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
KTR | పట్టాలివ్వకపోతే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రాళ్లతో కొట్టుమన్నడు.. రైతులతో కేటీఆర్
PYL Secretary | భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి : పీవైఎస్ కార్యదర్శి