Air India Plane crash | అహ్మదాబాద్‌లో గత గురువారం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన (Air India Plane crash) విషయం తెలిసిందే. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయల్దేరిన డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
విమానం కూలిన వెంటనే అక్కడ భారీ శబ్దం వచ్చింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతాని నల్లటి పొగ కమ్ముకుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు ఊపిరాడక.. బాల్కనీల నుంచి దుస్తుల సాయంతో కిందకు దిగుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో వైద్య విద్యార్థులు దుస్తులను జాయింట్ చేసి కిటీకీలు, బాల్కనీల నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
एयर इंडिया विमान क्रैश का नया वीडियो सामने आया है
हादसे के बाद का खौफनाक मंजर, घबराए मेडिकल के छात्र बिल्डिंग की खिड़कियों से कूदते नज़र आ रहे हैं…#airindia pic.twitter.com/p7u6XsJkGJ
— Ujjwal Deepak (@ujjwaldeepak) June 17, 2025
గతవారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలటర్లు, పది మంది క్రూ సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం కూలిన ఘటనలో 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్కవ్యక్తి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదంలో పలువురు మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఘటనలో దాదాపు 270 మందికిపైగా మరణించారు.
Also Read..
Air India | మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్ క్యాన్సిల్
Plane Crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. డీఎన్ఏ ద్వారా 125 మృతదేహాల గుర్తింపు పూర్తి