Plane Crash | ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రమాదంలో (Plane Crash) మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో (Ahmedabad Civil Hospital) డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 125 మంది బాధితుల వివరాలను గుర్తించినట్లు ఆసుపత్రి అధికారులు తాజాగా వెల్లడించారు. అందులో 83 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్‌లో డీఎన్ఏ ప్రయోగశాల 24 గంటలూ పనిచేస్తోంది.
72 గంటల్లో పూర్తవుతుందని చెప్పిన డీఎన్ఏ పరీక్ష 84 గంటలైనా పూర్తి కాకపోవడంతో మృతుల బంధువులు సిటీ సివిల్ దవాఖాన వద్ద పడిగాపులు పడాల్సి వస్తున్నది. అయితే ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తున్నదని.. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతున్నదని వైద్యులు తెలిపారు.
గతవారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు విమాన ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read..
విమానం మంటల్లో ఉండగా.. నడుచుకుంటూ బయటకు!
న్యూక్లియర్ రేస్!.. అణ్వాయుధాలను పెంచుకుంటున్న ప్రపంచ దేశాలు
Air India | మరో ఎయిర్ఇండియా విమానంలో సాంకేతిక సమస్య..