Air India | మరో ఎయిర్ఇండియా విమానంలో సాంకేతిక సమస్య..
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో (Air India)సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ180 విమానంలో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి.
కోల్‌కతా: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో (Air India)సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ180 విమానంలో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్ మంగళవారం తెల్లవారుజామున కోల్‌కతాలో విమానాన్ని నిలిపివేశారు. దీంతో భద్రత దృష్ట్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. విమానంలోని ఇంజిన్లలో ఒకటి పనిచేయడం లేదని, దీంతో విమానం ఎగరడంలో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానం కోల్‌కతా నుంచి ముంబై వెళ్లడానికి ఆలస్యమవుతుందని వెల్లడించారు.
ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సోమవారం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన ఏఐ 315 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. కాగా, గత గురువారం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

