విమానం మంటల్లో ఉండగా.. నడుచుకుంటూ బయటకు!
ఎయిరిండియా విమానంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఘటనా స్థలి నుంచి ఎలా బయటకు వచ్చాడనే విషయాన్ని తెలిపే మరొక కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో విమానం మంటల్లో కాలిపోతుండగా, బీజే వైద్య కళాశాల ప్రాంగణం నుంచి రమేశ్ నడుచుకుంటూ రావడం కనిపించింది.
- మృత్యుంజయుడు రమేశ్ మరో వీడియో వెలుగులోకి
అహ్మదాబాద్ : ఎయిరిండియా విమానంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఘటనా స్థలి నుంచి ఎలా బయటకు వచ్చాడనే విషయాన్ని తెలిపే మరొక కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో విమానం మంటల్లో కాలిపోతుండగా, బీజే వైద్య కళాశాల ప్రాంగణం నుంచి రమేశ్ నడుచుకుంటూ రావడం కనిపించింది. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు 64 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించినట్టు అధికారులు తెలిపారు. సోమవారం వరకు 99 మంది బాధితుల వివరాలను డీఎన్ఏ టెస్టు ద్వారా తెలుసుకోగలిగామన్నారు.
ఇంకా గుర్తించని మృత దేహాల గురించి వారి బంధువులు ఆందోళనకు గురి కావొద్దని సిటీ సివిల్ దవాఖాన సూపరింటెండెంట్ రాకేశ్ జోషి విజ్ఞప్తి చేశారు. 72 గంటల్లో పూర్తవుతుందని చెప్పిన డీఎన్ఏ పరీక్ష 84 గంటలైనా పూర్తి కాకపోవడంతో మృతుల బంధువులు సిటీ సివిల్ దవాఖాన వద్ద పడిగాపులు పడాల్సి వస్తున్నది. అయితే ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తున్నదని.. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతున్నదని వైద్యులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

