Sunetra Pawa | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి సునేత్ర పవార్ (Sunetra Pawar) రాజ్యసభ ఉప ఎన్నికలకు (Rajya Sabha by elections) ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎగువ సభలో మొత్తం పది ఖాళీలు ఉన్నాయి. అందులో అస్సాం, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రెండు చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కొక స్థానం ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫై చేసింది. దీంతో ఖాళీ అయిన స్థానాలకు జూన్ 25న ఎన్నికలు నిర్వహించనుంది.
దీంతో మహారాష్ట్ర నుంచి సునేత్ర పవార్‌ను పోటీకి దింపాలని ఎన్సీపీ నిర్ణయించింది. ఈ మేరకు నామినేషన్‌కు ఇవాళ చివరి రోజు కావడంతో ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. సునేత్ర పవార్ ఎంపికపై సీనియర్ ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ స్పందించారు. తాను కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలు సునేత్ర పవార్ పేరును ఖరారు చేసినట్లు చెప్పారు. అయితే, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Sunetra Pawar, NCP leader and wife of Maharashtra Deputy CM Ajit Pawar files her nomination for the Rajya Sabha by-elections.
Sunetra Pawar lost the recently held Lok Sabha election from Baramati to NCP-SCP candidate Supriya Sule. pic.twitter.com/ZoqlMnxVhz
— ANI (@ANI) June 13, 2024
ఇటీవలే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో సునేత్ర పవార్ బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన మరదలు, విపక్ష మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) కూటమి తరఫున నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్) పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే (Supriya Sule)పై ఆమె ఘోర ఓటమిపాలయ్యారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించిన సుప్రియా నాలుగోసారి కూడా జయకేతనం ఎగురవేశారు. తన వదినపై ఏకంగా 1.55 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో సుప్రియా సూలేకి 7,32,312 ఓట్లు పోలవగా.. సునేత్రకు 5,73,979 ఓట్లు వచ్చాయి.
Also Read..
GST Council Meeting | ఈ నెల 22న 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
Ice Cream | కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. ముంబై వైద్యుడికి ఊహించని అనుభవం
Rajnath Singh | దేశ రక్షణే మా ప్రాధాన్యత.. కేంద్ర రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ బాధ్యతలు