Ice Cream | ముంబైకి చెందిన ఓ వైద్యుడికి (Mumbai Doctor) ఊహించని అనుభవం ఎదురైంది. ఐస్ క్రీమ్ (Ice Cream) ఆర్డర్ చేస్తే అందులో మనిషి వేలు (human finger) వచ్చింది. ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ముంబైలోని మలాడ్ (Malad) ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువ వైద్యుడు ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావోకి ఐస్‌క్రీమ్ తినాలనిపించింది. దీంతో వెంటనే తన ఫోన్ తీసుకుని ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆన్లైన్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టేశాడు. యుమ్మో ఐస్ క్రీమ్స్ షాప్‌నుంచి మూడు యుమ్మో ఫ్లేవర్డ్ బటర్‌స్కోచ్ కోన్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ పెట్టాడు. నిమిషాల్లో ఐస్ క్రీమ్స్ కూడా ఇంటికి డెలివరీ అయ్యాయి. ఎంతో ఆశతో దాన్ని తీసుకుని తినడం మొదలు పెట్టాడు. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగులుతున్నట్లు అనిపించింది.
అది ఏదైనా నట్ లేదా చాక్లెట్ ముక్క కావొచ్చని ముందుగా భావించాడు. కానీ, అనుమానం వచ్చి ఐస్‌క్రీమ్‌ను పరిశీలించగా.. 2 అంగులాల మనిషి వేలు కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. వెంటనే మలాడ్‌లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వైద్యుడి పిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Chandrababu | ప్రజా పాలన ప్రారంభమైంది.. ప్రక్షాళన తిరుమల నుంచే : చంద్రబాబు
NEET | నీట్ పరీక్షలో 1563 మంది విద్యార్థుల గ్రేస్ మార్కులు రద్దు.. సుప్రీంకు తెలిపిన కేంద్రం