పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్వల్ప మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావచ్చని తెలుస్తున్నదని. నితీశ్ కుమార్ మరోసారి సీఎం పదవి చేపట్టే అకాశమున్నట్లు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ (exit polls) అంచనా వేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి కంటే ఎన్డీయే కూటమి ఫలితాలు కాస్త మెరుగ్గా ఉన్నట్లు పేర్కొంది. ఎన్డీయే కూటమి 121-141 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. 2020లో 37 శాతం ఓట్లు పొందిన ఎన్డీయే ఈసారి 43 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
కాగా, మహా కూటమికి 98-118 సీట్లు రావచ్చని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఈ కూటమికి 41 శాతం ఓట్లు పడవచ్చని పేర్కొంది. అయితే కేవలం రెండు శాతం ఓట్ల తేడా ఉండటంతో ఎన్డీయే, మహాకూటమి మధ్య గెలుపు దోబూచులాడుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
మరోవైపు రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ పార్టీ చీఫ్‌గా మారిన ప్రశాంత్ కిషోర్ ప్రభావం బీహార్ ఎన్నికల్లో ఏమాత్రం లేదని తెలుస్తున్నది. ఆయన స్థాపించిన జన్ సూరాజ్ పార్టీ కేవలం ఒక్క సీటు గెలుచుకునే అవకాశం మాత్రమే ఉన్నట్లు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. అయితే నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించి అధికారికంగా ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read:
police vehicle hits Bike | బైక్‌ను ఢీకొట్టిన పోలీస్ వాహనం.. భార్యాభర్తలు, కుమారుడు మృతి
Watch: ఫ్లైఓవర్ పిల్లర్ లోపల నిద్రించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి.. నిందితులను డ్రోన్‌తో వెంబడించిన కెమెరామెన్