Loksabha Elections 2024 : ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే జూన్ 4 దగ్గరపడుతున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమిలో అసహనం పెరుగుతోందని, ఓటమి భయంతో మోదీని దూషిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని మహరాజ్‌గంజ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశ ప్రజలు రాబోయే ఐదేండ్లకు మరోసారి మోదీని ఎన్నుకోనుండటాన్ని విపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
మీ పిల్లల భవిష్యత్ కోసం కేంద్రంలో పటిష్ట ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. వికసిత్ భారత్ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మరోసారి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కాంగ్రెస్ హయాంలో విచ్చలవిడి అవినీతి జరిగిందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. యూపీలోని సిద్ధార్ధనగర్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా అవినీతి గురించి వెల్లడించారని గుర్తుచేశారు. తాము ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే ప్రజలకు చేరుతోందని ఆయన అప్పట్లో చెప్పారని తెలిపారు.ఈ రోజు ఆ పరిస్ధితి లేదని, జన్‌ధన్ ఖాతాల్లో నేరుగా డబ్బు ప్రజలకు చేరుతోందని యోగి ఆదిత్యానాథ్ వివరించారు. తాము లక్నోలో కూర్చుని బటన్ నొక్కితే ఆ మరుక్షణమే ప్రజల ఖాతాల్లో డబ్బు జమవుతోందని తెలిపారు.
Read More :