Gas Leaked | కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. బాత్రూమ్ (Bathroom)లో గీజర్ నుంచి గ్యాస్ లీకై (Gas Leaked) అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మైసూరు (Mysuru)లో చోటు చేసుకుంది.
బాత్రూమ్లో గ్యాస్ పీల్చి గుల్ఫామ్ (23), సిమ్రాన్ తాజ్ (20) చనిపోయారు. అక్కాచెల్లెళ్లు చాలా సేపు వాష్రూమ్ నుంచి బయటకి రాకపోవడంతో, వారి తండ్రి అల్తాఫ్ అనుమానం వచ్చి డోర్ బద్దలు కొట్టి చూడగా.. కుమార్తెలు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే వారు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధరించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. గీజర్ వాయువును విడుదల చేసిందని, కానీ మంటలు అంటుకోలేదని తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమార్తెల మృతితో ఆ ఇంట విషాదం నెలకొంది.
Also Read..
Chhath Puja | 36 గంటల పాటూ కఠిన ఉపవాసం.. ఛట్ పూజ ప్రత్యేకత
Jaishankar: ఐక్యరాజ్యసమితి పనితీరును తప్పుపట్టిన జైశంకర్
Ex CIA Officer: ఆడ వేషంలో ఒసామా బిన్ లాడెన్ తప్పించుకున్నాడు: మాజీ సీఐఏ ఆఫీసర్