Chhath Puja | ఉత్తర భారతీయులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పండుగ ఛట్ పూజ (Chhath Puja). బీహార్ (Bihar), జార్ఖండ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో నేడు ఛట్ పూజ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజలు ఉదయం నుంచే నదుల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో నదీ తీరాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంది.
#WATCH | Aurangabad, Bihar: The four-day #ChhathPuja begins. Devotees perform the rituals of ‘Nahay Khay’ on the first day today. pic.twitter.com/guKHT5mSyk
— ANI (@ANI) October 25, 2025
సాధారణంగా దీపావళి పండుగ పూర్తయిన ఆరు రోజుల తర్వాత ఈ పండుగ వస్తుంది. ఏటా కార్తిక మాసం శుక్లపక్షంలోని షష్ఠి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ పూజలు చేస్తారు. ఈ రోజు మొదటి రోజును నహాయ్ ఖాయ్ (Nahay Khay), రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్ఠగా నహాయ్ఖాయ్ ఆచరిస్తారు. తినే ఆహారం నుంచి ధరించే వస్త్రాల వరకూ ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటాయి. పీలి మట్టితో పొయ్యి తయారుచేసి మామిడి కట్టెలను ఉపయోగించి అర్వాచావల్, శనగపప్పు, సొరకాయ లేదా అరటికాయతో తయారు చేసిన వంటకాన్ని ఆరగిస్తారు.
#WATCH | Varanasi, Uttar Pradesh: The four-day #ChhathPuja begins. Devotees perform the rituals of ‘Nahay Khay’ on the first day.
(Visuals from Dashashwamedh Ghat in Varanasi) pic.twitter.com/cristPrmI0
— ANI (@ANI) October 25, 2025
పండుగ సందర్భంగా చేసే వంటలో సొరకాయ తప్పనిసరిగా వాడతారు. అందుకే నహాయ్ ఖాయ్ భోజనాన్ని కొందరు కద్దూబాత్గా పేర్కొంటారు. ఈ వంటలో ఉప్పు ఉపయోగించరట. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగలో.. 36 గంటల పాటు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేయడం విశేషం. సకల సృష్టికి ఆధారమైన సూర్యభగవానుడిని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. సూర్యభగవానుడిని కొలిచే ఏకైక పూజ ఇదేనని అక్కడి వారి విశ్వాసం. దీనికే సూర్యశస్తిల్, దళాఛఠ్ అని కూడా పేర్లున్నాయి. మహిళలు సూర్య నమస్కారాలు చేసి వివిధ రకాల పూలు, పండ్లతో దేవుడికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పిస్తారు. నదీ ఘాట్ల వద్ద పండ్లతో అలంకరించి ఛఠ్మాతకు పూజలు చేస్తారు. అనంతరం ఆ పండ్లను పంచిపెడతారు.
Also Read..
Jaishankar: ఐక్యరాజ్యసమితి పనితీరును తప్పుపట్టిన జైశంకర్
Ex CIA Officer: ఆడ వేషంలో ఒసామా బిన్ లాడెన్ తప్పించుకున్నాడు: మాజీ సీఐఏ ఆఫీసర్
Air Pollution | ఢిల్లీలో తీవ్రస్థాయిలోనే వాయు కాలుష్యం.. జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యుల సూచన