Mysore Pak | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దాయాది దేశం పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ‘పాకిస్థాన్..’ అన్న పేరు వింటేనే దేశ ప్రజలకు చిర్రెత్తుకొస్తోంది. ఆ పేరు వినడానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదు. ఈ క్రమంలో రాజస్థాన్ జైపూర్ (Jaipur Shops)కు చెందిన ఓ మిఠాయి దుకాణం యజమాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తన దుకాణంలో ‘పాక్’ పేరుతో ఉన్న మిఠాయిలకు పేర్లు మార్చేశారు. మైసూర్‘పాక్’ (Mysore Pak) సహా వివిధ స్వీట్ల పేర్లను మార్చేశారు.
తన దుకాణంలోని ‘పాక్’ పేరుతో ఉన్న స్వీట్ల పేర్ల స్థానంలో ‘శ్రీ’ని యాడ్ చేశారు. మైసూర్‘పాక్’ని మైసూర్శ్రీ (Mysore Shree)గా, మోతీ‘పాక్’ని మోతీశ్రీగా, గోండ్పాక్ని గోండ్శ్రీగా ఇలా పేరు మార్చినట్లు దుకాణ యజమాని తెలిపారు. స్వీట్స్లోని ‘పాక్’పదం కన్నడలో తీపి అని అర్థం. అయితే, ప్రస్తుతం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు దుకాణదారుడు పేర్కొన్నారు.
గత నెల 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. సమీపంలోని అడవిలో నుంచి ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మతం అడిగి మరీ కుటుంబ సభ్యుల ఎదుటే కాల్చి చంపారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా చేపట్టింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది కీలక ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఇందుకు ప్రతిగా భారత్‌పై దాడికి ప్రయత్నించిన పాక్ సైన్యంపై కూడా విరుచుకుపడింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను గగనతలంలోనే కూల్చివేసింది. పాక్ ఆర్మీ స్థావరాలపై కూడా దాడి చేసి దాయాదికి గట్టి బుద్ధి చెప్పింది.
Also Read..
Ajit Doval | వచ్చే వారం రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు.. ఆ విషయంలో రష్యాను తొందర పెట్టేందుకే..!
Supreme Court | పోక్సో కేసులో దోషికి ఏ శిక్షా విధించని సుప్రీంకోర్టు.. ఎందుకంటే..!