Mysore Sandal Soap | మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియాను కర్నాటక ప్రభుత్వం నియమించింది. అయితే, ఈ నిర్ణయంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నాటకకు చెందిన హీరోయిన్లను కాదని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ బ్రాండ్ తమన్నాను తీసుకోవడంపై సోషల్ మీడియా వేదికగాపై మండిపడుతున్నారు. సర్కారు నిర్ణయంపై పలు పార్టీల నేతలు స్పందించారు. ఈ క్రమంలోనే కర్నాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
Read Also : Hera Pheri 3 | ‘హేరా ఫేరీ 3’ వివాదం.. పరేష్ తప్పుకోవడంతో కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్ కుమార్
ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. ఇది భాష, ప్రాంతీయ గుర్తింపునకు సంబంధించిన విషయం కాదని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కేఎస్డీఎల్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన సమగ్ర బ్రాండ్ వ్యూహమని ఎంబీ పాటిల్ పేర్కొన్నారు. తమన్నాకు పెద్ద ఎత్తున ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. 2030 నాటికి కేఎస్డీఎల్ అమ్మకాలను రూ.5000 కోట్లకు తీసుకెళ్లడమే మా లక్ష్యమని, దీనికి బలమైన మార్కెటింగ్ వ్యూహం అవసరమన్నారు. తమన్నా భాటియాకు 2.8 కోట్లకుపైగా సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్నారని.. ఇది ఆమె యువతరంతో కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుందన్నారు.
Read Also : Kenishaa Francis | జయం రవి-ఆర్తీ విడాకుల వివాదం.. కెనీషా ఫ్రాన్సిస్‌కు హత్య బెదిరింపులు
రష్మిక మందన్న, పూజా హెగ్డే, కియారా అద్వానీ, దీపికా పదుకొనే వంటి హీరోయన్లను పరిగణనలోకి తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇందులో కొందరికి వీలు కుదరలేదని.. మరికొందరు వేరే బ్రాండ్స్‌కు ప్రచారకర్తలుగా ఉన్నారన్నారు. ఈ పరిస్థితుల్లోనే తమన్నా భాటియాను తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 22న తమన్నా భాటియాను కేఎల్డీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు వచ్చాయి. కర్నాటకకు చెందిన హీరోయిన్ బ్రాండ్ ప్రచారకర్తగా ఉండాలని డిమాండ్ చేశారు.
#WATCH | Bengaluru: On controversy over Tamannaah Bhatia’s appointment as the brand ambassador of Karnataka Soaps and Detergents Limited, which manufactures Mysore Sandal Soap, Karnataka Minister MB Patil says, “…We have a prolonged strategy to take up the total sales to Rs… pic.twitter.com/iSszBnwW4h
— ANI (@ANI) May 23, 2025