PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పుట్టినరోజు (birthday) నేడు. ఈ సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రధానికి బర్త్డే విషెస్ చెబుతున్నారు. ప్రపంచ నాయకులు కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి (Israel PM) బెంజిమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) సైతం మోదీని స్పెషల్గా విష్ చేశారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
‘మై డియర్ గుడ్ ఫ్రెండ్ నరేంద్ర.. హ్యాపీ బర్త్డే. మీరు మీ జీవితంలో భారత్ కోసం ఎంతో చేశారు. భారత్ – ఇజ్రాయెల్ మధ్య స్నేహం కోసం మనం కలిసి గొప్ప విజయాన్ని సాధించాము. మన భాగస్వామ్యాన్ని, స్నేహాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. త్వరలో మిమ్మల్ని కలిసేందుకు ఎదురు చేస్తున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు మై ఫ్రెండ్’ అంటూ పేర్కొన్నారు. నెతన్యాహుతోపాటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బెనెస్, న్యూజిలాండ్ ప్రధాని, భూటాన్ ప్రధాని సహా ప్రపంచ నేతలు ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మోదీతో, భారత్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Also Read..
Italy PM | ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ఇటలీ ప్రధాని
Bike Stunt | బైక్ సీటుపై నిలబడి ప్రమాదకర స్టంట్స్.. వీడియో వైరల్
High Court | ఆ వీడియోను వెంటనే తొలగించండి.. కాంగ్రెస్కు పాట్నా హైకోర్టు ఆదేశాలు