BTech Student | గ్రేటర్ నోయిడా ( Greater Noida)లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి (BTech Student) ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. చదువులో రాణించలేకపోతున్నానంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాశాడు. తాను ఓడిపోయానని, చదువుకోసం ఇంకా డబ్బును వృధా చేయాలనుకోవడం లేదని అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు తన తల్లిదండ్రులకు క్షమాపణలు కోరాడు.
బీహార్‌కు చెందిన ఆకాష్ దీప్.. ఢిల్లీ టెక్నికల్ క్యాంపస్ (Delhi Technical Campus)లో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలో గల ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువును కొనసాగిస్తున్నాడు. అయితే, ఆకాష్ దీప్ మంగళవారం సాయంత్రం రూమ్మేట్ బయటకు వెళ్లిన సమయంలో తన గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లి తిరిగి వచ్చిన ఆకాష్ ఫ్రెండ్ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే ఆకాష్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థి గదిలో సూసైడ్ నోట్ దొరికింది. అందులో ‘అమ్మ, నాన్న.. నన్ను క్షమించండి. మీ కొడుకు బలహీనుడు. నేను వేరే ఎవరి వల్లో ఇలా చేయట్లేదు. నా మరణానికి నేను మాత్రమే బాధ్యుడిని. దయచేసి నా మరణం గురించి ఎవరినీ ఇబ్బంది పెట్టకండి. ఇంటర్లో ఒక ఏడాది వృధా చేశా. 11, 12 తరగతుల్లో నా ఫలితాలు చాలా పూర్‌గా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే చేయాలనుకోవడం లేదు. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. ఇక నా వల్ల కాదు. మీ డబ్బును వృధా చేసి, తప్పుడు ఆశలు కలిగించడం నాకు ఇష్టంలేదు. అందుకే ఇక్కడితో ముగించేస్తున్నా.. నన్ను క్షమించండి’ అని అందులో రాసుకొచ్చాడు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Thackeray Cousins | 20 ఏళ్ల తర్వాత కలిసిన థాక్రే సోదరులు.. ముంబై స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ
Leopard | సీఆర్పీఎఫ్ క్యాంప్‌లోకి ప్రవేశించిన చిరుత.. ఓ జవానుకు గాయాలు
Delhi High court :ఎయిర్ ఫ్యూరిఫయర్‌పై జీఎస్టీ తగ్గించండి. ప్రభుత్వాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు