Delhi High court :ఎయిర్ ఫ్యూరిఫయర్‌పై జీఎస్టీ తగ్గించండి. ప్రభుత్వాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు
Delhi High court : ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, దాన్ని ఎమర్జెన్సీగా భావించి ఎయిర్ ప్యూరిఫయర్లపై పన్నులు తగ్గించాలని కోర్టు కోరింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వాయు నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, దానిని ఎమర్జెన్సీగా భావించి ఎయిర్ ప్యూరిఫయర్లపై పన్నులు తగ్గించాలని కోర్టు కోరింది. చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జ్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు చేపట్టింది. ఎయిర్ ప్యూరిఫయర్లను మెడికల్ డివైస్‌లుగాభావించి, వాటిపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి చేర్చాలని కోర్టులో పిల్ వేశారు.
అయితే ఈ అంశంలో ఏమీ చేయలేకపోవడంతో ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి కావాలని, కానీ అధికారులు నాణ్యమైన గాలిని అందివ్వలేకపోతున్నట్లు ధర్మాసనం పేర్కొన్నది. ప్రతి రోజు మనిషి సగటున 21వేల సార్లు శ్వాస పీల్చుకుంటారని అంటే అన్ని సార్లు వాయువు పీలిస్తే దాని వల్ల ఎంత హాని జరుగుతుందో అంచనా వేసుకోవానల్నారు. కపిల్ మదన్ అనే వ్యక్తి ఈ పిటీషన్ వేశారు. తీవ్ర సంక్షోభం వేళ ఎయిర్ ప్యూరిఫయర్లను లగ్జరీ ఐటమ్‌లుగా భావించవద్దు అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- air purifier
- Delhi
- gst
- High court
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

