Leopard | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లాలో చిరుతపులి (Leopard) కలకలం రేపింది. సీఆర్పీఎఫ్ క్యాంప్ (CRPF Camp)లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. అక్కడ అధికారులపై దాడి చేసింది. చిరుత దాడిలో ఓ జవానుకు గాయాలయ్యాయి. ‘చిరుతపులి దాడిలో హెడ్ కానిస్టేబుల్ కమలేశ్వర్ కుమార్ గాయపడ్డాడు. స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించాం. అతని పరిస్థితి స్థిరంగా ఉంది’ అని ఓ అధికారి తెలిపారు. మరోవైపు చిరుతను చూసిన సిబ్బంది ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Panic gripped in a #CRPF camp in Kapran area #Anantnag on Wednesday morning after a #leopard entered the premises and attacked personnel during breakfast hours, leaving one jawan injured. pic.twitter.com/WntUImXgia
— Aijaz Itoo (@itoo_aijaz) December 24, 2025
Also Read..
Military Camp | మిలిటరీ క్యాంప్‌లో కాల్పులు.. ఆర్మీ ఆఫీసర్ మృతి
Jammu and Kashmir | చలి తీవ్రతకు వణుకుతున్న కశ్మీర్.. విపరీతంగా మంచు.. పడిపోయిన ఉష్ణోగ్రతలు