Thackeray Cousins | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విభేదాలతో విడిపోయిన థాక్రే సోదరులు (Thackeray Cousins) ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray), రాజ్ థాక్రే (Raj Thackeray) మళ్లీ కలిశారు.
ముంబై స్థానిక ఎన్నికల్లో (municipal elections) కూటమిగా ఏర్పడి పోటీ చేస్తామని ప్రకటించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నదమ్ములిద్దరూ కీలక ప్రకటన చేశారు. జనవరి 15న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (ఠాక్రే వర్గం), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ముంబైకి మరాఠీ మేయర్ రానున్నారని వెల్లడించారు (Mumbais Mayor Will Be A Maharashtrian).
కాగా, 2005లో విడిపోయిన వీరు దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఈ ఏడాది జులైలో ముంబైలో నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమంలో తొలిసారి ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇకపై ఇద్దరం కలిసే ఉంటామని సోదరులు అప్పుడు స్పష్టం చేశారు. ఇక అన్నదమ్ముల కలయికపై ఇరు పార్టీల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Leopard | సీఆర్పీఎఫ్ క్యాంప్‌లోకి ప్రవేశించిన చిరుత.. ఓ జవానుకు గాయాలు
Delhi High court :ఎయిర్ ఫ్యూరిఫయర్‌పై జీఎస్టీ తగ్గించండి. ప్రభుత్వాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు
Military Camp | మిలిటరీ క్యాంప్‌లో కాల్పులు.. ఆర్మీ ఆఫీసర్ మృతి