Richest Ganesh | ఆగస్టు 27.. గణేశ్ చతుర్థి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా గణేశ్ ఉత్సవ సందడి మొదలైంది. ప్రధాన నగరాల్లో ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై..’ అంటూ నినాదాలు మార్మోగిపోతున్నాయి. అయితే, ముంబై (Mumbai)లోని ఓ గణేశుడు ధనిక గణేశ్ (Richest Ganesh)గా నిలిచిన విషయం తెలిసిందే. కింగ్స్ సర్కిల్లోని జీఎస్బీ సేవా మండల్ గణపతి (GSB Seva Mandal Ganpati)కి ఈ పేరు దక్కింది. తాజాగా ఈ సంపన్న గణేశ్ ఫస్ట్‌లుక్‌ను నిర్వాహకులు ఇవాళ రివీజ్ చేశారు. ఈ విగ్రహంని చూసి భక్తులు మంత్రముద్ధులయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్బీ సేవామండల్ వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తోంది. ఈసారి విఘ్నేశ్వరుడి మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు బీమా చేయించటం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక్కడి విగ్రహాన్ని భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించనుండటమే అందుక్కారణం. ఈ ఏడాది 69 కేజీల బంగారు ఆభరణాలు, 336 కేజీల వెండి ఆభరణాలతో గణనాథుడిని అలంకరించనున్నారు. అందుకోసమే అంతమొత్తంలో బీమా చేయించారు.
పూజారులు, నిర్వాహకులు, సహాయకులు, భద్రతా సిబ్బందికి రూ.375 కోట్లకు వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకున్నారు. గణపయ్యకు అలంకరించే బంగారం, వెండి, ఆభరణాలకు రూ.67 కోట్ల బీమా వర్తించనుంది. అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో రూ.2కోట్ల బీమా తీసుకున్నారు. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కోసం సుమారు రూ.30 కోట్లు కేటాయించారు. ఇక గతేడాది ఈ మండపానికి రూ.400.58 కోట్లకు బీమా చేయించారు.
Also Read..
Fire at motorbike showroom | షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 60 ద్విచక్ర వాహనాలు
Himachal Pradesh | హిమాచల్‌పై మరోసారి ప్రకృతి ప్రకోపం.. భారీ వర్షానికి కుప్పకూలిన భవంతులు.. VIDEO
Himachal Pradesh: హిమాచల్‌లో ఉప్పొంగుతున్న బియాస్ నది.. మనాలీలో కొట్టుకుపోయిన రోడ్లు, హోటళ్లు