Himachal Pradesh | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)పై మళ్లీ ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించింది. ఇప్పటికే కుండపోత వర్షాలకు కుదేలైన హిమాచల్‌ను మరోసారి భారీ వర్షం (heavy rain) కుదిపేసింది. కులు, మనాలీ, సిమ్లా సహా పలు ప్రధాన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ధర్మశాల (Dharamshala)లో కురిసిన వర్షానికి భారీ నష్టం సంభవించింది. ఇళ్లు కూలిపోయాయి (houses collapsed). రోడ్లు ధ్వంసమయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి ధర్మశాలలోని సుదే ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, విపత్తును ముందే గ్రహించిన అధికారులు ఆ భవనాన్ని ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్ కూలిపోతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Kangra, Himachal Pradesh: Several houses collapsed and roads were damaged in Dharamshala following heavy rainfall pic.twitter.com/CsadnTTOyD
— ANI (@ANI) August 26, 2025
కాగా, సోమవారం హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. భారీ వరదల వల్ల కిరాట్పూర్-మనాలీ జాతీయ హైవేపై నష్టం జరిగింది. దీంతో మండి, మనాలీలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల .. బియాస్ నది ఉప్పొంగుతున్నది. దాని ఉప నదులు కూడా ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
तेज़ बारिश के बीच सुधेड़ में बहुमंज़िला भवन जमींदोज।
कोई जानी नुकसान नहीं, भवन पहले से ही खाली कराया गया था।
स्थानीय प्रशासन की सतर्कता से बड़ी त्रासदी टली #Dharamshala #HimachalPradesh #BuildingCollapse pic.twitter.com/aO5gCId0OG
— Amit Pandey (@amitpandaynews) August 25, 2025
మనాలీ సమీపంలో ఉన్న బిందు ధంక్ వద్ద బియాస్ నది వరద నీటికి జాతీయ హైవే కొట్టుకుపోయింది. దీంతో పాపులర్ టూరిస్టు కేంద్రానికి రాకపోకలు తెగిపోయాయి. మనాలీలో నది సమీపంలో ఉన్న ఓ హోటల్.. ఆ వరదలో కొట్టుకుపోయింది. మండి, కులు ప్రాంతాల్లో డేంజర్ మార్క్ దాటి నది ప్రవాహిస్తున్నది. లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. బహంగ్, అలూ గ్రౌండ్ ప్రాంతాల నుంచి జనాలను తరలిస్తున్నారు. మరో 24 గంటల పాటు నది సమీపానికి వెళ్లవద్దు అని టూరిస్టులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
Also Read..
Apple | దూకుడుమీదున్న యాపిల్.. భారత్‌లో నాలుగో రిటైల్ స్టోర్ ప్రకటించిన టెక్ దిగ్గజం
Myanmar | మయన్మార్‌ను మరోసారి కుదిపేసిన భూకంపం
Thimmapur | కేసీఆర్, కేటీఆర్ స్ఫూర్తితో.. తిమ్మాపూర్‌లో మట్టి గణపతుల పంపిణీ