తిమ్మాపూర్: వినాయక చవితిని పురస్కరించుకుని తిమ్మాపూర్ (Thimmapur) మండలం కేంద్రంలో భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ప్రారంభించారు. గణపతి విగ్రహాలతోలతోపాటు పూజా సామాగ్రిని అందజేశారు. ఇంటి వద్ద నిమజ్జనం చేసుకొని నీళ్లు పోస్తే వారం తర్వాత కృష్ణ తులసి, రామ తులసి మొక్కలు వస్తాయని దేవేందర్ రెడ్డి చెప్పారు.
పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గ్రామస్తులకు అవగాహన కల్పించడంతోపాటు భక్తి పెంపొందించే ఉద్దేశంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ స్ఫూర్తితో పంపిణీ చేసినట్లు దేవేందర్ రెడ్డి తెలిపారు. భక్తులు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, నాయకులు పాశం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, నాయిని వెంకటరెడ్డి, వేల్పుల మల్లయ్య, గడ్డి రమేష్, కరివేద జనార్దన్ రెడ్డి, పోతరాజు దేవేందర్, ఎడ్ల అంజిరెడ్డి, కొండ్రరాజు, గాజసాగర్ తదితరులు పాల్గొన్నారు.