Myanmar | మయన్మార్ (Myanmar)లో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 25 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, దీని తీవ్రత తక్కువ స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
EQ of M: 3.5, On: 26/08/2025 03:03:25 IST, Lat: 22.62 N, Long: 96.17 E, Depth: 25 Km, Location: Myanmar.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/GeYrnGOCWn— National Center for Seismology (@NCS_Earthquake) August 25, 2025
కాగా, ఈ ఏడాది మార్చిలో మయన్మార్‌ను అత్యంత శక్తిమంతమైన భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. మార్చి 28న మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు రోడ్లు, వంతెనలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ విపత్తులో దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంపం ధాటికి పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) ప్రకారం.. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 200,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక మధ్య మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలు ప్రతిరోజూ కుదుపులకు గురవుతున్నాయి. ఇక భారత్-మయన్మార్ సరిహద్దుల్లో (India-Myanmar border)నూ వరుస భూకంపాలు (Earthquakes) సంభవించాయి. జూన్ 10వ తేదీన 36 గంటల్లో ఏకంగా ఆరుసార్లు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8 నుంచి 4.5 మధ్య నమోదైంది. ఈ ప్రకంపనల ధాటికి ఈశాన్య రాష్ట్రాలు కూడా వణికిపోయాయి.
Also Read..
Trump Tariffs | రేపటి నుంచి భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు.. అమెరికా అధికారిక నోటీసులు
ఓపీటీ ప్రోగ్రామ్‌పై ట్రంప్ కత్తి?
రష్యాలో భారత కార్మికులకు డిమాండ్!