మాస్కో, ఆగస్టు 25: నిర్మాణం, వస్త్ర పరిశ్రమ సహా కీలక రంగాల్లో రష్యా కంపెనీలు భారతీయ నిపుణులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఆసక్తిచూపుతున్నాయి. సంప్రదాయ రంగాలతోపాటు మెషినరీ, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక విభాగాల్లో భారతీయ కార్మికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ స్వయంగా వెల్లడించారు.
ఇటీవల ఆయన రష్యా ప్రభుత్వ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘రష్యాలో మానవ వనరుల అవసరం ఉంది. ఇక్కడి చట్టాలు, నిబంధనలు, కోటా పరిమితులకు లోబడి రష్యా కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.’ అన్నారు.